Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జాగింగ్​ చేస్తున్నవారిని చూసి.. జనమంతా భయంతో పరుగుపరుగు.. సరదా వీడియో ఇదిగో

Public panic run at a restaurant
  • జాగింగ్ చేస్తున్న కొందరిని చూసి ఆందోళనతో పరుగెత్తడం మొదలుపెట్టిన మహిళ
  • ఆమెను చూసి కొందరు.. ఆ తర్వాత జనమంతా పారిపోయిన తీరు
  • మాఫియా ముఠాల దాడి అన్న భయంతో పరుగెత్తి ఉంటారంటున్న నెటిజన్లు
సాధారణంగా ఏదైనా గొడవ జరుగుతుందంటే అంతా నిలబడి చూస్తూ ఉంటారు. ఒకరిద్దరుగా మొదలై పెద్ద సంఖ్యలో గుమిగూడుతుంటారు కూడా. అదే పరిస్థితి ఏదైనా ప్రమాదకరంగా మారుతుంది అనిపిస్తే ఒక్కరు కూడా కనిపించరు. ఎక్కడివారు అక్కడకి పారిపోతుంటారు. అలాంటి ఓ సరదా ఘటన ఇటీవల బ్రెజిల్ లో జరిగింది. అసలే ఏమీ లేని దానికి జనమంతా కంగారు పడిపోయి పారిపోయిన తీరు నెటిజన్లను నవ్విస్తోంది.

జాగింగ్ చేస్తున్నవారిని చూసి..
బ్రెజిల్ లోని ఎడ్ కాలిఫోర్నియా ప్రాంతంలో వీధి పక్కన చిన్నచిన్న హోటళ్లలో జనం కూర్చుని తింటున్నారు. మనుషులు నడిచే వాకింగ్ ట్రాక్ కు అటూ ఇటూ ఆ హోటళ్లు ఉన్నాయి. మధ్యలోంచి కొందరు అటూ ఇటూ తిరుగుతున్నారు. కాసేపటికి కొందరు జాగింగ్ చేసేవారు అటువైపు వచ్చారు. హోటళ్ల మధ్యలోని దారి నుంచి జాగింగ్ చేస్తూ వెళుతున్నారు. మొదట ఒకరిద్దరు, ఆ వెనుక ఓ ఏడెనిమిది మందిదాకా జాగింగ్ చేస్తున్నారు. 

పారిపోతున్నారనుకుని..
జాగింగ్ చేస్తున్న వారిని చూసి పారిపోతున్నారేమో అనుకున్న ఓ మహిళ.. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందేమోనని భావించి లేచి పరుగెట్టడం మొదలుపెట్టింది. అది చూసి మరికొందరు పారిపోవడం ప్రారంభించారు. వెంటనే అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. ఒక్కరు కూడా మిగలకుండా అంతా పడుతూ లేస్తూ అక్కడి నుంచి పరుగెత్తారు. చివరికి చూస్తే ఏమీ లేదు. ఇంకా జాగింగ్ చేసేవారు మెల్లగా పరుగెడుతూ వస్తూనే ఉన్నారు. ఈ దృశ్యమంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. అయితే ఈ ఘటన రాత్రిపూట జరగడంతో అంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. 

మాఫియా ముఠాలేమో అనుకుని..
  • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఏకంగా కోటీ 44 లక్షల వ్యూస్, 33 వేలకుపైగా లైకులు వచ్చాయి. ఇది సరదాగా ఉందంటూ కొందరు, 'మనుషుల తత్వమే అంత' అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
  • మనుషులలో ఆందోళన అలాగే ఉంటుందని, అంతా పరుగెడుతుంటే ఏం జరిగిందని అడగకుండానే మిగతావారు పరుగెత్తుతారని మరికొందరు పేర్కొంటున్నారు. ‘‘దీనినే మాబ్ మెంటాలిటీ అని, ఫాలో ద క్రౌడ్ అని అంటారు” అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
  • అయితే.. ‘‘బ్రెజిల్ లో మాఫియా గ్యాంగులు ఎక్కువ. వీధుల్లోనే దాడులు, కాల్పులు జరుపుకోవడం వంటివి తరచూ జరుగుతుంటాయి. అందుకే ఒకరిద్దరు పరుగెత్తగానే.. అలాంటి మాఫియా ముఠా దాడి ఏదో జరుగుతోందన్న భయంతో మిగతావారు పరుగెత్తి ఉంటారు..” అని బ్రెజిల్ కు చెందిన ఓ నెటిజన్ వివరణ ఇవ్వడం గమనార్హం.
Public panic
Viral Videos
Offbeat
Brazil
Twitter

More Telugu News